Monday, December 31, 2007

మడొన లై్వ్ ఎర్త్


పాప్ గాయని మడొన గత జులై 7 న లండన్‌ లో ఇచ్చిన లై్వ్ ఎర్త్ కార్యక్రమం లోని ఈ పాటను చూసి,విని,చదివి ఆనందించండి

Hey you,Don’t you give up, it’s not so bad
There’s still a chance for usHey you,Just be yourself,
don’t be so shy
There’s reasons why it’s hard

Keep it together, you’ll make it alright
Our celebration is going on tonight
Poets and prophets would envy what we do
This could be good,
hey you
Hey you,
Open your heart,
it’s not so strange
You’ve got to change this time
Hey you,
Remember this,
none of it’s realIncluding the way you feel

Keep it together,
we’ll make it alright
Our celebration is going on tonight
Poets and prophets would envy what we do
This could be good,
hey you

Save your soul,
little sisterSave your soul, little brother

Hey you, save yourselfDon’t rely on anyone else

First love yourself, then you can love someone else
If you can change someone else, then you have saved someone else
But you must first love youself,
then you can love someone elseI
f you can change someone else,
then you have saved someone elseBut you must first

Hey you,They’re on the fence,
you’ve got a choice
One day it will make senseHey
you,First love yourself,
or if you can’t,Try to love someone else

Keep it together,
we’ll make it alrightOur celebration is going on tonightPoets and prophets will envy what we do
This could be good,
hey you

First love yourself,
then you can love someone else
If you can change someone else,
then you have saved someone else
But you must first love youself,
then you can love someone else
If you can change someone else,
then you have saved someone else
But you must first

Wednesday, December 26, 2007

అభినందనీయం


http://pichukalu.blogspot.com/
పర్యావరణం అంటే మనం.పర్యావరణ పరిరక్షణ అంటే మనం మనల్నీ,మనపరిసరాలనూ,చెట్టూ,పుట్టా,గాలీ,నీరు,కొండాకోనా,వాగూవంకా,పిట్టాపిచికా,­అన్నిటినీ ముఖ్యంగా మనరేపును,మనభవిష్యత్తును,సం రక్షించుకునేందుకూ నిరంతరం చేయాల్సిన ఒక వ్రతం.దానికి ఏవ్రతకల్పాలూ,వ్రతఫలాలూ ప్రత్యేకంగా ఉండవు.మన జీవన శైలీ,వినిమయవిధానాలూ,అందరూ పచ్చగా ఉండాలని కోరుకునే చల్లని,మంచిమనసు చాలు.అచ్చంగా పర్యావరణానికో బ్లాగుండాలా అనేదో ప్రశ్న.ఉండాలి ఎందుకంటే తెలుగులో ప్రత్యేకించి పర్యావరణం గురించి ఏ వెబ్ సైట్లూ లేవు.కొన్ని సైట్లలో తరచూ కొన్ని వార్తలను ఇచ్చేందుకు వారు కృషి చేస్తున్నారు.ఎందరికో పర్యావరణంపట్ల ఆసక్తి ఉంది,అందుకోసం ఏమైనా చెయాలనే ఉత్సాహమూ ఉంది.కానీ దానికో దారీతెన్నూ కావాలి.మొదట పర్యావరణం గురించి మీ భావనలను నలుగురితో పంచుకోండి.మీరు చేయాలనుకున్న ప్రణాలికలను బహిరంగంగా ఆలోచించండి(థింక్ అలౌడ్).మీ దృష్టికి వచ్చిన సంఘటనలను,అనెక్ డోట్సునూ, ఫొటోలనూ,వీడియోలనూ, వార్తా క్లిప్పింగ్సునూ,లింకులనూ, ఇక్కడ ఉంచండి.అలాగే మీసొంత బ్లాగుల్లో,వెబ్ సైట్లోనూ ఉంచండి.
పర్యావరణం గురించి బ్లాగుల్లో రాయండి,లేదా నేను పంపించే ఆంగ్లవ్యాసాలను తెలుగులోకి లేదా తెలుగు వ్యాసాలను ఆంగ్లములోకి అనువదించండి. అలాగే స్వంతంగా తెలుగులోకి సృజనాత్మక రచనలను పర్యావరణం అనే అంశంపై రాయటం ప్రారంభించండి. ప్రతిరోజూ ఈ బ్లాగులో, మీబ్లాగులో ఒక్కటైనా ప్రకృతి సంబంధరచన ఉండేట్లు చూడండి దయచేసి. ఇక నాగురించి పర్యావరణం గురించి ఎంతో సమాచారం నా దగ్గర సిద్ధంగా ఉంది.నాకు ఇటీవలే ఎకొ ఎథిక్స్ ఇంటర్నేషనల్ యూనియన్ జర్మనీ వారు స్థానిక చాప్టర్ ప్రారంభించు కునేందుకు అనుమతినిచ్చారు. అదే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్,చైల్డ్ అబ్యూజ్ వంటి విషయాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు గాను ఒక ఎన్ జీ వో ను ప్రారంభిస్తున్నాను. ఈరెండు కొత్తసంవత్శరంలో,సంక్రాంతి శెలవల అనంతరం అధికారికంగా కార్యక్రమాలు ఆరంభిస్తాయి.
కాబట్టి మిత్రులారా,పెద్దలారా మనకోసం మనభవిష్యత్తు కోసం ఒక్క చిన్న అడుగు వేద్దాం.రండి రాజేంద్ర కుమార్ దేవరపల్లి
From: kotta pali
ఇది మంచి పరిణామం. మీరు వేస్తున్న మొదటి అడుగు త్రివిక్రముడి మూడు అడుగులై భూనభోంతరాళములని ఆవరించు గాక. నాకు చేతనైన సహాయం చేస్తాను. పనిలో పనిగా పర్యావరణం నేపథ్యంగా ఈ మధ్య కొన్ని తెలుగు కథలూ కవితలూ వచ్చాయి, వస్తున్నాయి .. తగిన అనుమతులు పొంది వాటిని పూర్తిగానో కొద్దిగానో ఇక్కడ ప్రచురిస్తే బావుంటుంది. వివరాలకి మీరు గుంటూరులో కవి, రచయిత పాపినేణి శివశంకర్ గారిని సంప్రదించండి. చంద్రలత అనె యువ రచయిత్రి దృశ్యాదృశ్యం అనే నవల ప్రచురించారు రెండు మూడేళ్ళా క్రితం .. భారీ ఆనకట్టలు ఎలా పర్యావరణాన్ని జీవనోపాధుల్ని అతలాకుతలం చేస్తాయో అనే నేపథ్యంలో .. అటువంటి రచనల్ని సమీక్షించి విశ్లేషిస్తే కూడా బావుంటుంది. ఏదేమైనా .. మీరీ పని మొదలెట్టడం అభినందనీయం.
http://kottapali.blogspot.com/ http://vinnakanna.blogspot.com/ http://telpoettrans.blogspot.com/
పెద్దలు కొత్తపాళి గారికి అభివాదాలు, మీ వంటి ఎందరో పెద్దల మార్గదర్శకత్వం తప్పకుండా నాకు లభిస్తుందన్న భరోసాతోనే ఈ ప్రయత్నానికి ఒడికట్టాను.ఎన్నో పర్యావరణ సంస్థలు అంతర్జాతీయంగా కృషి చేస్తున్నా మనరాష్ట్రంలోనూ లెక్కకు మిక్కిలిగా ఉన్నా ఒక్క వెబ్ సైట్ కూడా తెలుగులో లేకపోవటం నా ఈఆలోచనకు మొదటి ప్రేరణ.ఈ పిచ్చుకలు బ్లాగు కాలక్రమంలో ఒక విస్తృతమైన పోర్టల్ గా రూపుదిద్దుకోవాలనేది నాకొక చిన్న ఆశ.ఎరిన్ బ్రాకొవిచ్ సినిమా గురించి చాలా చర్చ జరిగింది,ఆసినిమా కూడా చాలా వరకూ అందుకు పాత్రమైనదే. కాక పోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఏమన్నా వచ్చాయా అని శోధించగా ఒక సినిమా సుమారు మనమెవరమూ పుట్టని రోజుల్లో అంటే 1961లో వచ్చింది.ఆత్రెయ దర్శకత్వం వహించిన వాగ్దానం పరిసరాల పరిశుభ్రత గురించి ఎంతో చక్కగా చర్చిస్తుంది. ఇలా ఎన్నో మరుగునపడిన అంశాలను వెలుగులోకి తెచ్చి అందరితో పంచుకోవాలని, అందరూ పాలుపంచుకోవాలనేదే, నా విన్నపం.
భవదీయుడు
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
From: "krishna rao jallipalli
DEAR ALL,
YOU ARE ALL 100 PCT. CORRECT. THE PITY IS... THERE ARE SO MANY TELUGU T.V. CHANNELS. BUT NO ONE SHOWING INTEREST IN THIS SUBJECT. THEY SHOULD ALSO COMPENSATE SOME THING TO THIS NATURE CAUSE. REGARDS KRISHNA RAO J GUNTUR

పెద్దలు జల్లిపల్లి కృష్ణ రావు గారికి అభివాదాలు,మీ వంటివారి ఆశీస్సులు ప్రోత్శాహం ఎంతో అవసరం మాకు.మీఫోను నంబర్ ఇస్తే నేను వచ్చినప్పుడు మిమ్ముల్నివ్యక్తిగతంగా కలసిమాట్లాడతాను.ఈలోపు మీవద్దనుంచి పిచ్చికలకు కాస్త నూక,గింజలు మీరచనల రూపం లో పంపగలరు.నేను దాదాపు జనవరి మొదటి రెండువారాల్లో రాగలను.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
From: Sreenivas Paruchuri
Here are some random thoughts and quick links ... You are right that there isn't much material in Telugu, but its slowly coming.
One of the most prominent names, in A.P, in this field is Rajahmundry- based Tallavajjhala Patanjalisastri. I know that he worked on translating Edward Hyam's "Soil and Civilization" and even wrote a brilliant essay (kind of preface to the Telugu text), but to my knowledge HBT people never published that book.
I see that Papineni, Chandralata's names are already mentioned. Papineni recently also wrote a story on the extinction of #piccukalu#. I even remember poems on the ill-effects of pesticides. Also, I can't imagine that there are no NGOs already working in this area.
Some 10 years ago there used to be the Telugu version: #tEneTeega# of the magazine "Honeybee" run by Prof. Gupta of IIT-Ahmedabad. Those days the Telugu version was maintained by some lady at Padmavathi University, Tirupathi. More details below ... I was/am so impressed by his work that during my student days I once even travelled all the way to Frankfurt airport to meet him.
http://www.iimahd.ernet.in/~anilg/ http://www.sristi.org/cms/
Needless to say there are tons of books, groups, websites on this subject - within India - in English. Two sites that I closely follow are:
Centre for Science and Environment (CSE) and the magazine: Down to Earth, they publish,
http://www.cseindia.org/
and
http://www.narmada.org/
Its such a vast subject and that too living in Germany - which is one of the most environmentally conscious countries - have a lot more to say. But, may be in future in form of comments on your blog. Good luck!
Regards, Sreenivas
dear srinivas,thank you very much for your kind words and informative message. I am aware about the services rendered by Dr.TallavajjhalaPatanjalisastri and i hope i have gone through his -erravaadi illu'an treatise on environment. as it was earlier mentioned the real problem is not with the info and the material but how to translate into telugu and the course of action which requires a great deal of teamwork. many learned friends expressed their willingness to contribute their might in this endeavour. since most of the NGO's concentrate upon many thrust areas they do not willing to bring a publication entirely environment or ecological issues. the same will apply to the websites and portals too. in this regard my humble request is i would rather monitor the contributions of friends like you whenever you sends an piece of information along with my regular writings. i will pursue whatever you have suggested.
thank you once again
Regards rajendra

సునామీలు నివాళి


ఎందుకో తెలియదుగానీ ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి సంఘటనకూ స్పందించే మన బ్లాగు మిత్రులు సునామి మృతులకు నివాళి అర్పించటం మర్చిపోయారేమో అనిపిస్తొంది. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసి వేలాది ప్రాణాలను బలిగొన్న సునామి చాలా కఠోర సత్యాలు మానవాళికి నేర్పింది. ఎంతవరకూ నేర్చుకున్నాము అనేది మన విచక్షణా జ్నానం మీద ఆధార పడి ఉంది.
సునామి వచ్చిన కొద్ది కాలానికి నాకు అంతర్జాతీయ పత్రికైన 'గ్లామర్' నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఒక సునామి బాధితురాలు, పిల్లలున్న ఒక వితంతువు గురించి ఫొటో ఆర్టికల్ ఒకటి పంపగలవా అని. నేను రాయను అని తిరస్కరించాను.
కారణం తృతీయదేశాల మరణాలు కూడా గ్లామరు పత్రీకల్లో చోటు సంపాదించి మరి కాసిని కన్నీళ్ళు ఓ గుప్పెడు నిట్టూర్పులను సంపాదించగల దేమో గానీ దాని వల్ల మనంనేర్చుకునేది శూన్యం. సునామీలు ఎప్పుడో గాని రావు, కానీ మనం రోజూ నేర్చుకోవచ్చు.

Monday, December 24, 2007

ఒక్క చిన్న అడుగు వేద్దాం


పర్యావరణం అంటే మనం.పర్యావరణ పరిరక్షణ అంటే మనం మనల్నీ,మనపరిసరాలనూ,చెట్టూ,పుట్టా,గాలీ,నీరు,కొండాకోనా,వాగూవంకా,పిట్టాపిచికా,అన్నిటినీ ముఖ్యంగా మనరేపును,మనభవిష్యత్తును,సం రక్షించుకునేందుకూ నిరంతరం చేయాల్సిన ఒక వ్రతం.దానికి ఏవ్రతకల్పాలూ,వ్రతఫలాలూ ప్రత్యేకంగా ఉండవు.మన జీవన శైలీ,వినిమయవిధానాలూ,అందరూ పచ్చగా ఉండాలని కోరుకునే చల్లని,మంచిమనసు చాలు.అచ్చంగా పర్యావరణానికో బ్లాగుండాలా అనేదో ప్రశ్న.ఉండాలి ఎందుకంటే తెలుగులో ప్రత్యేకించి పర్యావరణం గురించి ఏ వెబ్ సైట్లూ లేవు.కొన్ని సైట్లలో తరచూ కొన్ని వార్తలను ఇచ్చేందుకు వారు కృషి చేస్తున్నారు.ఎందరికో పర్యావరణంపట్ల ఆసక్తి ఉంది,అందుకోసం ఏమైనా చెయాలనే ఉత్సాహమూ ఉంది.కానీ దానికో దారీతెన్నూ కావాలి.మొదట పర్యావరణం గురించి మీ భావనలను నలుగురితో పంచుకోండి.మీరు చేయాలనుకున్న ప్రణాలికలను బహిరంగంగా ఆలోచించండి(థింక్ అలౌడ్).మీ దృష్టికి వచ్చిన సంఘటనలను,అనెక్ డోట్సునూ, ఫొటోలనూ,వీడియోలనూ, వార్తా క్లిప్పింగ్సునూ,లింకులనూ, ఇక్కడ ఉంచండి.అలాగే మీసొంత బ్లాగుల్లో,వెబ్ సైట్లోనూ ఉంచండి.

పర్యావరణం గురించి బ్లాగుల్లో రాయండి,లేదా నేను పంపించే ఆంగ్లవ్యాసాలను తెలుగులోకి లేదా తెలుగు వ్యాసాలను ఆంగ్లములోకి అనువదించండి. అలాగే స్వంతంగా తెలుగులోకి సృజనాత్మక రచనలను పర్యావరణం అనే అంశంపై రాయటం ప్రారంభించండి. ప్రతిరోజూ ఈ బ్లాగులో, మీబ్లాగులో ఒక్కటైనా ప్రకృతి సంబంధరచన ఉండేట్లు చూడండి దయచేసి.
ఇక నాగురించి పర్యావరణం గురించి ఎంతో సమాచారం నా దగ్గర సిద్ధంగా ఉంది.నాకు ఇటీవలే ఎకొ ఎథిక్స్ ఇంటర్నేషనల్ యూనియన్ జర్మనీ వారు స్థానిక చాప్టర్ ప్రారంభించు కునేందుకు అనుమతినిచ్చారు. అదే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్,చైల్డ్ అబ్యూజ్ వంటి విషయాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు గాను ఒక ఎన్ జీ వో ను ప్రారంభిస్తున్నాను. ఈరెండు కొత్తసంవత్శరంలో,సంక్రాంతి శెలవల అనంతరం అధికారికంగా కార్యక్రమాలు ఆరంభిస్తాయి.

కాబట్టి మిత్రులారా,పెద్దలారా మనకోసం మనభవిష్యత్తు కోసం ఒక్క చిన్న అడుగు వేద్దాం.రండి

Tuesday, December 18, 2007

ఆదియందు మనిషికి హృదయముండెను...





పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO