Wednesday, December 26, 2007

సునామీలు నివాళి


ఎందుకో తెలియదుగానీ ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి సంఘటనకూ స్పందించే మన బ్లాగు మిత్రులు సునామి మృతులకు నివాళి అర్పించటం మర్చిపోయారేమో అనిపిస్తొంది. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసి వేలాది ప్రాణాలను బలిగొన్న సునామి చాలా కఠోర సత్యాలు మానవాళికి నేర్పింది. ఎంతవరకూ నేర్చుకున్నాము అనేది మన విచక్షణా జ్నానం మీద ఆధార పడి ఉంది.
సునామి వచ్చిన కొద్ది కాలానికి నాకు అంతర్జాతీయ పత్రికైన 'గ్లామర్' నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఒక సునామి బాధితురాలు, పిల్లలున్న ఒక వితంతువు గురించి ఫొటో ఆర్టికల్ ఒకటి పంపగలవా అని. నేను రాయను అని తిరస్కరించాను.
కారణం తృతీయదేశాల మరణాలు కూడా గ్లామరు పత్రీకల్లో చోటు సంపాదించి మరి కాసిని కన్నీళ్ళు ఓ గుప్పెడు నిట్టూర్పులను సంపాదించగల దేమో గానీ దాని వల్ల మనంనేర్చుకునేది శూన్యం. సునామీలు ఎప్పుడో గాని రావు, కానీ మనం రోజూ నేర్చుకోవచ్చు.

1 Comentário:

vennela said...

nijam chepparu..ee kaalamlo kaadedi publishing ki anarham ani chaati cheputhunnai mana patrikalu,TV channels.

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO