ఒక్క చిన్న అడుగు వేద్దాం
పర్యావరణం అంటే మనం.పర్యావరణ పరిరక్షణ అంటే మనం మనల్నీ,మనపరిసరాలనూ,చెట్టూ,పుట్టా,గాలీ,నీరు,కొండాకోనా,వాగూవంకా,పిట్టాపిచికా,అన్నిటినీ ముఖ్యంగా మనరేపును,మనభవిష్యత్తును,సం రక్షించుకునేందుకూ నిరంతరం చేయాల్సిన ఒక వ్రతం.దానికి ఏవ్రతకల్పాలూ,వ్రతఫలాలూ ప్రత్యేకంగా ఉండవు.మన జీవన శైలీ,వినిమయవిధానాలూ,అందరూ పచ్చగా ఉండాలని కోరుకునే చల్లని,మంచిమనసు చాలు.అచ్చంగా పర్యావరణానికో బ్లాగుండాలా అనేదో ప్రశ్న.ఉండాలి ఎందుకంటే తెలుగులో ప్రత్యేకించి పర్యావరణం గురించి ఏ వెబ్ సైట్లూ లేవు.కొన్ని సైట్లలో తరచూ కొన్ని వార్తలను ఇచ్చేందుకు వారు కృషి చేస్తున్నారు.ఎందరికో పర్యావరణంపట్ల ఆసక్తి ఉంది,అందుకోసం ఏమైనా చెయాలనే ఉత్సాహమూ ఉంది.కానీ దానికో దారీతెన్నూ కావాలి.మొదట పర్యావరణం గురించి మీ భావనలను నలుగురితో పంచుకోండి.మీరు చేయాలనుకున్న ప్రణాలికలను బహిరంగంగా ఆలోచించండి(థింక్ అలౌడ్).మీ దృష్టికి వచ్చిన సంఘటనలను,అనెక్ డోట్సునూ, ఫొటోలనూ,వీడియోలనూ, వార్తా క్లిప్పింగ్సునూ,లింకులనూ, ఇక్కడ ఉంచండి.అలాగే మీసొంత బ్లాగుల్లో,వెబ్ సైట్లోనూ ఉంచండి.
పర్యావరణం గురించి బ్లాగుల్లో రాయండి,లేదా నేను పంపించే ఆంగ్లవ్యాసాలను తెలుగులోకి లేదా తెలుగు వ్యాసాలను ఆంగ్లములోకి అనువదించండి. అలాగే స్వంతంగా తెలుగులోకి సృజనాత్మక రచనలను పర్యావరణం అనే అంశంపై రాయటం ప్రారంభించండి. ప్రతిరోజూ ఈ బ్లాగులో, మీబ్లాగులో ఒక్కటైనా ప్రకృతి సంబంధరచన ఉండేట్లు చూడండి దయచేసి.
ఇక నాగురించి పర్యావరణం గురించి ఎంతో సమాచారం నా దగ్గర సిద్ధంగా ఉంది.నాకు ఇటీవలే ఎకొ ఎథిక్స్ ఇంటర్నేషనల్ యూనియన్ జర్మనీ వారు స్థానిక చాప్టర్ ప్రారంభించు కునేందుకు అనుమతినిచ్చారు. అదే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్,చైల్డ్ అబ్యూజ్ వంటి విషయాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు గాను ఒక ఎన్ జీ వో ను ప్రారంభిస్తున్నాను. ఈరెండు కొత్తసంవత్శరంలో,సంక్రాంతి శెలవల అనంతరం అధికారికంగా కార్యక్రమాలు ఆరంభిస్తాయి.
కాబట్టి మిత్రులారా,పెద్దలారా మనకోసం మనభవిష్యత్తు కోసం ఒక్క చిన్న అడుగు వేద్దాం.రండి
Seja o primeiro a comentar
Post a Comment