Monday, March 31, 2008

మూడు ఆంధ్రజ్యోతి వార్తలు

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/30national9
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/31business4


సింహాద్రి' కాలుష్యంపై సీరియస్‌
అసెంబ్లీలో ఎమ్మెల్యే లేవనెత్తడంతో అప్రమత్తం

విశాఖపట్నం, మార్చి 30 (ఆన్‌లై న్‌): నేషనల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (సింహాద్రి) కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పిసి బి) అప్రమత్తమైంది. విద్యుత్‌ తయా రీకి వినియోగించే ముడిసరుకు నుం చి విడుదలైన యాష్‌ను నిల్వ చేయ డంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించింది. పారిశ్రామి క ప్రాంత పరిశ్రమల కాలుష్యంపై పెందుర్తి ఎమ్మెల్యే తిప్పల గురు మూర్తిరెడ్డి ఈ నెల 25న అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

ప్రజలకు ఇబ్బం దులు కలుగజేసే పరిశ్రమలపై కొర డా ఝుళిపించేందుకు వెనుకాడమని అటవీ, కాలుష్య నియంత్రణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చెప్పడంతో సంబంధిత శాఖ రంగం లోకి దిగింది. పిట్టవానిపాలెం, దేవా డ, పాలవలస, కడితినాయుడు పాలెం, మరడదాసరిపేట తదితర గ్రామాలకు ఎన్టీపీసీ యాష్‌ గాలి ద్వారా చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కి రవుతున్నారని కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే ధ్రువీకరించింది.

దీనిపై ఆంధ్రవిశ్వవిద్యాలయ నిపుణు లు కూడా పరిశోధించి యాష్‌తో ప్ర మాదం వుందని స్పష్టం చేశారు. దీని తో సింహాద్రి యాజమాన్యానికి కాలు ష్య నియంత్రణ మండలి అధికారులు గతంలో మార్గదర్శకాలు జారీ చేశా రు. అయినా యాజమాన్యం నుంచి స్పందనలేదు. ఈ విషయంలో ఎ మ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించేసరికి కాలుష్య నియంత్రణ మండలి ఉన్న తాధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మండలి మెంబర్‌ కార్యదర్శి రాజేష్‌ తివారీ సంబంధిత అధికారులను ఆదేశిం చారు.

ఇందుకు సంబంధించి మం డలి టాస్క్‌ఫోర్స్‌ అధికారి శివారెడ్డి పూర్తి వివరాలను అందజేసినట్టు తెలి సింది. సింహాద్రి యాజమాన్యాన్ని పిలిచి న్యాయ విచారణ జరిపి నిబం ధనల అమలుకు మార్గదర్శకాలు రూ పొందించాలని నిర్ణయించినట్టు తెలి సింది. దీనిపై మండలి టాస్క్‌ఫోర్స్‌ అధికారి శివారెడ్డిని వివరణ కోరగా, సింహాద్రి ప్లాంట్‌ యాష్‌ వల్ల కాలు ష్యం ఎక్కువగా వున్నట్టు చెప్పారు. యాష్‌ పాండ్‌ గట్టు ఎత్తు పెంచాలని, యాష్‌పై నిరంతరం నీటిని ్రస్పే చేయాలని, ట్రీట్‌మెంట్‌ చేయకుండా కూలింగ్‌ నీటిని సముద్రంలోకి విడి చిపెట్టరాదని సూచించామన్నారు. అయితే తాము సూచించినవేవీ అమలు కానందున మరోసారి గట్టిగా చెప్పేందుకు నిర్ణయించామన్నారు.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/30state7

కాలుష్యభూతం దెబ్బకు గంగాజలం గరళం...






కాలుష్యభూతం దెబ్బకు గంగాజలం గరళం...



http://andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/30new12

లక్నో, మార్చి 30: గంగానదికి కాలుష్యం కాటు పాత మాటే అయినా, ఇప్పుడా కాలుష్య స్థాయి మరీ పెరిగిపోతున్న కారణంగా గంగా జలాలు రోగకారక జీవాణువుల స్థావరంగా మారిపోయాయని జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వారణాసిలోనే ఎగువనగల అస్సీ ఘాట్‌నుంచి వరుణ సంగం వరకూ గల ఏడు కిలోమీటర్ల మేర జలాల్లోని కాలుష్య స్థాయి రోగకారకస్థితికి చేరిపోయిందని, ఇందుకు పూర్తి ఆధారాలున్నాయని జలనిపుణుడు ప్రొఫెసర్‌ వీరభద్ర మిశ్రా వెల్లడించారు. ఈయన బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతిగా పనిచేసి రిటైరయ్యారు.

గంగానదీ జలాలను కాలుష్యం బారినుండి విముక్తం చేయడానికి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా పరిస్థితులు మరీ దిగజారుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. గంగశుద్ధికార్యక్రమం కింద నదీ పరీవాహక ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో సంకట్‌మోచన్‌ ఫౌండేషన్‌ నెలకొల్పిన ప్రయోగశాలల్లో ఈ జలాలను పరీక్షించినపుడు.. ఎగువన అస్సీఘాట్‌వద్ద ఇవి మరీ మురికిగా తయారయ్యాయని, అవి వ రుణ సంగం చేరేటప్పటికి పూర్తిగా రోగకారకంగా మారుతున్నాయని తేలినట్లు మిశ్రా తెలిపారు.

వారణాసి నగరంలోని మురుగు నీరును కలిపేస్తున్నందువల్లే గంగ ఇంతగా కలుషితమైపోతోందని, కాలుష్యానికి ఏకంగా 95 శాతం మేర కారకమైన ఈ మురుగునీటిని గంగలో చేరనివ్వకుండా చేయడం వల్ల గంగా జలాలను కాపాడవచ్చునని, పైగా నగర మురుగునీటిని శుద్ధిజేయడం ద్వారా ఆ నీటిని తిరిగి వినియోగించవచ్చునంటూ 1995లోనే తాను ప్రభుత్వానికి ఓ పథకాన్ని సమర్పించినా దానికి అతీగతీలేదని ఫౌండేషన్‌ చైర్మన్‌కూడా అయిన మిశ్రా చెప్పారు.

వివిధ ప్రాంతాల ప్రకారం చూస్తే..
వారణాసివద్ద 32, కాన్పూర్‌వద్ద 22, అలహాబాద్‌వద్ద 40 ప్రాంతాల వద్ద ఈ మురుగు నీరు గంగలో కలుస్తున్నదని ఆయన వివరించారు. అంటే ఈ మూడు చోట్లా కలిపి 94 మురుగుకాల్వల నీరు గంగలో కలిసి నీటిని విషతుల్యం చేస్తోంది.

Friday, March 28, 2008

అన్ని పాఠశాలల్లో పర్యావరణ విద్య


అన్ని పాఠశాలల్లో పర్యావరణ విద్య
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

హైదరాబాద్‌, మార్చి 27 (ఆన్‌లైన్‌): వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని పాఠశాలన్నింట్లోనూ 'పర్యావరణ విద్య'ను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు దాన్ని బోధిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటరమణ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇవి ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌సీఈఆర్‌టీ పర్యావరణ విద్యపై సిలబస్‌ను రూపొందించింది. పర్యావరణ పరిరక్షణకు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు 'పర్యావరణ విద్య'ను పాఠశాలల్లో బోధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Monday, March 17, 2008

పిచ్చుకలకే అది లేకుండా పోతోంది





















పిచుకల గురించి ఈ రోజు మార్చ్ 17,౨౦౦౮, ఆంఢ్రజ్యోతి దినపత్రిక చాలా మంచి వ్యాసం ప్రచురించింది.
http://andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/౧౬మైన౩

పిచ్చుకలకే అది లేకుండా పోతోంది

ఊరపిచ్చుకల నుంచి తయారుచేసే లేహ్యం వాడితే సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుందని ఓ నమ్మకం. అదెంత నిజమో కానీ.. పెచ్చు పెరిగిన కాలుష్యం ఆ ఊర పిచ్చుకల సెక్స్‌సామర్థ్యాన్నే దెబ్బతీసింది. చివరికి పిచ్చుకలకే అది లేకుండా పోతోంది. ప్రతికూల పరిస్థితుల్లో సంతానాన్ని ఉత్పత్తి చేయలేక క్రమేణా ఇవి కనుమరుగవుతున్నాయి. మిగతా పక్షిజాతులూ అంతర్ధానమయ్యే ప్రమాదముంది.

ఊర పిచ్చుకలు.. ఈ పేరెప్పుడో విన్నట్టు అనిపిస్తుంది కదూ.. ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏనాడో మరిచిపోయిన ఆత్మీయ నేస్తాలు. పదిపదిహేనేళ్ల క్రితం వరకు మన ఇళ్లల్లోనే మనతోబాటే సహజీవనం చేసిన బంధువులు. ఈ చిరుప్రాణులు కనిపించక చాలా కాలం అయింది కదా.. అదొక్కటేనా.. దసరా రోజు ఊరు ఊరంతా వెదికి మరీ చూసే పాలపిట్ట ఇప్పుడు దుర్భిణి వేసి చూసినా కనిపించదేం. వడ్రంగి పిట్ట, చెవులు తూట్లు పడేలా అరిచే గోకరగాళ్లు ఏమయిపోయాయి. ఎక్కడికి వెళ్లి పోయాయివన్నీ.. క్షేమంగా ఉన్నాయా?

ఈ చిరు ప్రాణులకేమైంది?
ఒకనాడు ఎక్కడచూస్తే అక్కడ కనిపించిన ఊరపిచ్చుకలు ఇప్పుడు మీరు భూతద్దం వేసకుని గాలించినా కనిపించవు. పల్లెల్లో మితిమీరిన పురుగు మందుల వాడకం ఈ పక్షుల ఆహారాన్ని హాలాహలం చేస్తే, పట్టణాల్లో కాలుష్యం ఈ చిరుజీవులను చిదిమేసింది. ప్రస్తుతం ఈ జాతి ప్రమాదంలో ఉంది. ఇప్పటికైనా పరిరక్షించుకోకపోతే, వీటిని ఇకపై ఫొటోల్లో చూసుకోవాల్సిందే. ఎన్ని పక్షులు ఉన్నాయో తెలిపేందుకు లెక్కలు లేవు.. ఎన్ని పోయాయో చెప్పే అధ్యయనాలూ లేవు. కానీ, ఇప్పటికైనా వీటిని సంరక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా చర్యలు మాత్రం ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఊరపిచ్చుకలు ప్రమాదంలో పడడానికి గల కారణాలను అన్వేషించేందుకు పరిశోధనలు ప్రారంభ మయ్యాయి.

ఏమిటి ఈ పరిస్థితికి కారణం?
రాష్ట్రంలో వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ ఊరపిచ్చుకలను ప్రమాదంలో పడవేసింది. మొదటి నుంచీ ఇళ్లల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అలవాటుపడిన ఈ పక్షులకు అపార్టుమెంటులు, మల్టీస్టోర్డ్‌ బిల్డింగులు గూడును దూరం చేస్తే వాహన కాలుష్యం ఊపిరాడనివ్వ లేదు. నగరాల్లో ఇవి గూడు ఏర్పాటు చేసుకునే ప్రాంతాలు కరవయ్యాయి. ఆవాసాల కోసం విస్తారంగా చెట్లను నరికి వేయడంతో ఆహార కొరత ప్రారంభమైంది. ఇళ్లల్లో అందం కోసం పెంచుకునే చెట్లు ఈ పక్షలకు మేతను అందించ లేకపోయాయి. ఆహారం, ఆవాసం కోసం మిగతా బలమైన పక్షులతో ఇవి పోరాడాల్సి వచ్చింది. కాలుష్యంతోపాటు సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు వీటి పునరుత్పత్తి సామర్థ్యం పైనా తీవ్ర దుష్ప్రభావం చూపాయి. దీంతో పట్టణాల్లో ఊరపిచ్చుకలు దాదాపుగా అంతర్ధానమయ్యాయి.

ప్రస్తుతం జంటనగరాల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ మురికి వాడలు, మహబూబ్‌ చౌక్‌ పక్షుల విక్రయదుకాణాల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదు. పల్లెల్లోనూ ఇలాంటి పరిస్థితులే. గ్రామీణ ప్రాంతాల్లో పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకం పెరిగి పోవడంతో, ఈ పక్షుల ఆహారం విషతుల్య మైంది. ఇప్పటికీ ఈ పక్షులు కాస్తోకూస్తో కనిపిస్తున్నాయంటే.. అది పల్లెల్లోనే. ఇప్పుడు పల్లెలకూ పట్నం వాసనలు విస్తరిస్తుండడంతో .. మిగిలిన కొద్దిపాటి పక్షులు కూడా కనిపించకుండా పోయే ప్రమాదం మరెంతో దూరంలో లేదు.

సెల్‌ఫోన్ల ప్రభావం కూడా కారణమే..!!
ఊరపిచ్చుకల అంతర్ధానానికి సెల్‌ఫోన్‌ టవర్లు, సిగ్నళ్లు (విద్యుద యస్కాంత తరంగాలు) కూడా కారణమని సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఆర్నిథాలజీ అండ్‌ నేచురల్‌ హిస్టరీ(సెకాన్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. విజయన్‌ పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల తీవ్రతకు, పక్షుల అంతర్థానానికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించేందుకు ఇప్పటికే జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం స్పష్టమైందని ఆయన వివరించారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఊరపిచ్చుకలు మనుగడ సాగించలేవని ఇప్పటికే స్పెయిన్‌లో జరిగిన పరిశీలనలో తేటతెల్లమైంది. సెల్‌ఫోను యాంటిన్నాల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఈపక్షులను తరిమివేస్తున్నాయని తాజాగా లండన్‌లోని బ్రిటీష్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఆర్నిథాలజీ సభ్యులు జరిపిన పరిశోధనల్లో తేలింది.

ఈ పరిశోధనల్లో దాదాపు 30వేల మంది పక్షి అధ్యయనకారులు పాలుపంచుకున్నారు. సాధారణంగా చాలా ఎత్తులో ఏర్పాటు చేసిన సెల్‌ఫోను టవర్ల నుంచి విడుదలైన విద్యుదయస్కాంత తరంగాలు చాలా దూరం విస్తరించి ఉంటాయి. ఇవి పక్షులపై అంతగా ప్రభావాన్ని చూపలేవు. కానీ ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు సెల్‌ఫోన్‌ యాంటెన్నాల నుంచి ఈ తరంగాల తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. ఈ సిగ్నళ్లు చాలా దుష్ప్రభావం చూపుతాయి. పల్లెలు, పట్నాలని తేడా లేకుండా సెల్‌ వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరంగాల తీవ్రతను తక్కువగా అంచనా వేయలేం. సెల్‌ఫోన్‌ టవర్లు ఏర్పాటుచేసిన ప్రాంతాల్లో ఊరపిచ్చుకలు అసలే నివాసం ఉండలేవు. ప్రస్తుతం విజయన్‌ నేతృత్వంలోని సెకాన్‌ పరిశోధకుల బృందం ఈ పక్షులపై సెల్‌ఫోన్‌ తరంగాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తోంది.

సెల్‌ తరంగాల వల్ల ఎలుకల వీర్యకణాల సంఖ్య తగ్గిపోయి నట్లు స్పష్టమైంది. అలాగే ఊరపిచ్చుకల కేంద్రనాడీ వ్యవస్థపై సిగ్నళ్ల ప్రభావం ఉండవచ్చని భావిస్తున్న పరిశోధకులు ఆ దిశగా పరిశోధనలు జరుపుతున్నారు. ఊరపిచ్చుకలు ఇళ్లలోకి దూరి అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని నానా హంగామా చేస్తుంటే.. అమాయకత్వం అని మనం నవ్వుకున్నాం కానీ.. కోల్పోయిన సహచరులను తమ ప్రతిబింబంలో చూసుకుని ఊరడిల్లుతున్నాయని గుర్తించలేకపోయాం. మానవునితో సన్నిహితంగా ఉండే ఈ పక్షులే ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే.. మిగిలిన పక్షుల సంగతేమిటి. ఎన్ని ఉన్నాయి.. ఎన్ని పోయాయి. నాగరిక ప్రవాహంలో మునుముందుకే కొట్టుకుపోతున్న మనం.. నేడు వెనుదిరిగి చూసుకుంటే కొన్ని పక్షులు మాయమయ్యాయని గుర్తించాం. ఇకనైనా మేల్కొనకపోతే ఆ తరువాత మిగిలిన పక్షులనూ ప్రదర్శనశాలల్లో చూసుకోవాల్సిందే.

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO