కాలుష్యభూతం దెబ్బకు గంగాజలం గరళం...
కాలుష్యభూతం దెబ్బకు గంగాజలం గరళం...
http://andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/30new12
లక్నో, మార్చి 30: గంగానదికి కాలుష్యం కాటు పాత మాటే అయినా, ఇప్పుడా కాలుష్య స్థాయి మరీ పెరిగిపోతున్న కారణంగా గంగా జలాలు రోగకారక జీవాణువుల స్థావరంగా మారిపోయాయని జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వారణాసిలోనే ఎగువనగల అస్సీ ఘాట్‌నుంచి వరుణ సంగం వరకూ గల ఏడు కిలోమీటర్ల మేర జలాల్లోని కాలుష్య స్థాయి రోగకారకస్థితికి చేరిపోయిందని, ఇందుకు పూర్తి ఆధారాలున్నాయని జలనిపుణుడు ప్రొఫెసర్ వీరభద్ర మిశ్రా వెల్లడించారు. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతిగా పనిచేసి రిటైరయ్యారు.
గంగానదీ జలాలను కాలుష్యం బారినుండి విముక్తం చేయడానికి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా పరిస్థితులు మరీ దిగజారుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. గంగశుద్ధికార్యక్రమం కింద నదీ పరీవాహక ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో సంకట్‌మోచన్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రయోగశాలల్లో ఈ జలాలను పరీక్షించినపుడు.. ఎగువన అస్సీఘాట్‌వద్ద ఇవి మరీ మురికిగా తయారయ్యాయని, అవి వ రుణ సంగం చేరేటప్పటికి పూర్తిగా రోగకారకంగా మారుతున్నాయని తేలినట్లు మిశ్రా తెలిపారు.
వారణాసి నగరంలోని మురుగు నీరును కలిపేస్తున్నందువల్లే గంగ ఇంతగా కలుషితమైపోతోందని, కాలుష్యానికి ఏకంగా 95 శాతం మేర కారకమైన ఈ మురుగునీటిని గంగలో చేరనివ్వకుండా చేయడం వల్ల గంగా జలాలను కాపాడవచ్చునని, పైగా నగర మురుగునీటిని శుద్ధిజేయడం ద్వారా ఆ నీటిని తిరిగి వినియోగించవచ్చునంటూ 1995లోనే తాను ప్రభుత్వానికి ఓ పథకాన్ని సమర్పించినా దానికి అతీగతీలేదని ఫౌండేషన్ చైర్మన్‌కూడా అయిన మిశ్రా చెప్పారు.
వివిధ ప్రాంతాల ప్రకారం చూస్తే..
వారణాసివద్ద 32, కాన్పూర్‌వద్ద 22, అలహాబాద్‌వద్ద 40 ప్రాంతాల వద్ద ఈ మురుగు నీరు గంగలో కలుస్తున్నదని ఆయన వివరించారు. అంటే ఈ మూడు చోట్లా కలిపి 94 మురుగుకాల్వల నీరు గంగలో కలిసి నీటిని విషతుల్యం చేస్తోంది.
2 Comentários:
Rajendra garu - Just an FYI -
http://www.cnn.com/2008/HEALTH/03/10/pharma.water1.ap/
...idoka rakam kalushyam...adee sangati
అవునండి బాగా చెప్పారు..ఇలా గంగనే కాకుండా ఇంకెని జలపాతాలు వున్నాయో కొవకు చెందినవి.చెప్పుకొవడమే కాని చేసెది లేకుండా పోయింది.
Post a Comment