అన్ని పాఠశాలల్లో పర్యావరణ విద్య
అన్ని పాఠశాలల్లో పర్యావరణ విద్య
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
హైదరాబాద్, మార్చి 27 (ఆన్‌లైన్): వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని పాఠశాలన్నింట్లోనూ 'పర్యావరణ విద్య'ను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు దాన్ని బోధిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటరమణ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇవి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌సీఈఆర్‌టీ పర్యావరణ విద్యపై సిలబస్‌ను రూపొందించింది. పర్యావరణ పరిరక్షణకు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు 'పర్యావరణ విద్య'ను పాఠశాలల్లో బోధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Seja o primeiro a comentar
Post a Comment