Sunday, May 25, 2008

మొక్కలోస్తున్నాయి జాగ్రత్త మరి కొన్ని వార్తలు





టీవీ చానళ్ళకన్నా పత్రికలు మెరుగు

రాష్ట్రంలో,దేశంలో,ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న పర్యావరణసమస్యలను మన తెలుగు పత్రికలు శక్తివంచన లేకుండా పాఠకులకు అందిస్తున్నాయి,తగు పరిష్కారాలూ సూచిస్తున్నాయి.టీవీ చానళ్ళకన్నా ఈ విషయంలో పత్రికలు ఎంతో మెరుగనిస్పిస్తున్నాయి.వార్త,సాక్షి,ఈనాడు(విశాఖ ఎడిషన్)నుంచి కొన్ని వార్తాంశాలు












Saturday, May 24, 2008

ఆ వ్యర్థాలు సేకరించింది డాక్టర్‌ రెడ్గీస్‌ నుంచే...,మరో వ్యర్థ బాగోతం - ఈసారి 'అరబిందో'

ఆ వ్యర్థాలు సేకరించింది డాక్టర్‌ రెడ్గీస్‌ నుంచే...

హైదరాబాద్‌, మే 24 ః జీడిమెట్ల వ్యర్థాల డంపింగ్‌ కేసు మరో మలుపు తిరి గింది. వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించిన బాలాజీ ఫ్లెక్సో కార్మికులు పోలీసుల వద్ద డాక్టర్‌ రెడ్డీస్‌ పేరు బయటపెట్టారు. డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన పరిశ్రమల నుంచి సేకరించిన సాల్వెంట్ల నుంచే సీరా తయారు చేసేవారమని కార్మికులు పోలీసులకు వివరిం చారు. అదే విధంగా గోదాములో ఉన్న డ్రమ్ములు సైతం డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి తీసుకుని వచ్చినవేనని వారు వాగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పటికే అక్కడ ఉన్న డ్రమ్ముల్లో రెడ్డీస్‌ లేబుల్స్‌ స్పష్టంగా కనిపించాయి. అయితే కార్మి కులు సైతం అదే విషయాన్ని స్పష్టం చేయడం విశేషం. ఇప్పుడు బంతి కాలుష్య నియంత్రణ మండలి అధి కారుల కోర్టులోకి వెళ్లింది.

చాంద్‌పాషా, ఆసిఫ్‌ల కోసం గాలింపు వ్యర్థ రసాయనాలు డంపింగ్‌ జరిపిన ప్రదేశం మెహదీపట్నం నివాసి ఆసీఫ్‌ సోదరులదిగా గుర్తించిన పోలీసులు దర్యాపులో భాగంగా వారికి సంబంధించిన మరో పరిశ్రమ బాలాజీ ఫ్లెక్సోపై దాడులు నిర్వహించి అక్కడ పనిచేస్తున్న కార్మికులు నరేష్‌, వకీల్‌, విజయ్‌కుమార్‌, ధర్మా, చిన్నాలను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పరిశ్రమలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నరేష్‌ తమ యజమాని ఆసీఫ్‌ వద్ద ఆ స్థలాన్ని చాంద్‌పాషా అనే వ్యక్తి లీజుకు తీసుకుని ఈ డంపింగ్‌కు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు.

అంతే కాకుండా తమ పరిశ్రమకు కావలసిన సాల్వెంట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ నుంచి వస్తుంటాయని, పలు మార్లు సాల్వెంట్లతో పాటు వ్యర్థ రసాయన డ్రమ్ములు కూడా అధిక సంఖ్యలో వస్తాయని ఆయన పోలీసుల విచారణలో తెలిపాడు. నరేష్‌ తెలిపిన సమాచారం మేరకు జీడిమెట్ల పోలీసులు చాంద్‌ పాషా కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థల యజమానులు ఆసీఫ్‌ సోదరులు, లీజుకు తీసుకున్న చాంద్‌ పాషా పరారీలో ఉన్నారు.

************************************************************************************

మరో వ్యర్థ బాగోతం - ఈసారి 'అరబిందో'

హైదరాబాద్‌, మే 24 ః జీడిమెట్లలో ఓ అక్రమ డంప్‌ వెలుగుచూసి నాలుగు రోజులు కాకముందే దానికి సమీపంలోని మరో పారిశ్రామిక వాడలో అక్రమ రసాయనాల నిల్వలు బ యటపడ్డాయి. జనావాసాల నడుమ విష రసాయనాలను వదలడం, భూగర్భంలో, నాలాల్లో డంప్‌ చేయడం, అక్రమంగా వ్యర్థాలను నిల్వ చేయడం నేరమని తెలిసీ వాళ్లీ పని చేస్తుంటే ఏమనగలం ? ఇలాంటి నేరాలు ఎన్ని వెలుగు చూసినా 'వాటిని మేమరగం' అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుంటే ఏం చేయగలం? మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం గ్రామ సమీపంలో ఉన్న 'అరబిందో ఫార్మా' యూనిట్‌ -5లో వెలుగు చూసిన అక్రమ విష రసాయనాల బాగోతం చదివితే అసలు విషయం అర్థమవుతుంది. పాశమైలారం గ్రామం నుంచి పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు కాలుష్యంపై ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్రవారం పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పారిశ్రామిక వాడపై దండయాత్రకు వెళ్లారు.

ఈ క్రమంలోనే అరబిందో ఫార్మా యూనిట్‌-5 పరిశ్రమ పక్కనే నిర్మించిన మరో ప్లాంట్‌లో అక్రమ వ్యర్థాల నిల్వలు వారి కంటపడ్డాయి. అరబిందోకు చెందిన ఇతర యూనిట్ల నుంచి వ్యర్థాలను పెద్ద ఎత్తున అక్కడ డంప్‌ చేస్తున్నట్లు స్పష్టమైంది. అశాస్త్రీయంగా భూమిలో ఘన వ్యర్థాలను నిల్వ ఉంచడాన్ని పసిగట్టారు. ఈ తంతుకు కాపలాగా పరిశ్ర మ యాజమాన్యం సెక్యూరిటీ సిబ్బందిని నియమించింది. నిబంధనలకు పాతర పర్యావరణ నిబంధనల ప్రకారం రసాయనాల ఉత్పత్తిలో వెలువడే వ్యర్థాలను వాటి తీవ్రతను బట్టి శుద్ధి చేయాల్సి ఉం టుంది. ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని హైదరాబాద్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌కు నిల్వ కోసం తరలించాలి. ఈ విధంగా టన్ను ఘన వ్యర్థాలకు రూ. 25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా రసాయన జలా లను పటాన్‌చెరు ఎన్విరోటెక్‌ లిమిటెడ్‌ (పిఇటిఎల్‌)కు శుద్ధి కోసం పంపాలి. అటు వంటిది అరబిందో ఫార్మా తద్విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పాశమైలారం పారిశ్రామిక వాడకు సమీపంలో ఉన్న ఇతర అనుబంధ ఫార్మా కంపెనీల యూనిట్‌ల నుంచి వెలువ డుతున్న వ్యర్థాలను సేకరించి యూనిట్‌-5 సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి అక్ర మంగా రవాణా చేస్తూ సమీప పరిసరాల్లో, మరెక్కడో డంప్‌ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ నిబంధనలు

* పరిశ్రమ ఉత్పత్తిలో వెలువడే రసా యన వ్యర్థాలను ముఖ్యంగా ఆర్గానిక్‌ వ్యర్థా లను మూడు మాసాలకు మించి నిల్వ ఉంచడానికి వీలులేదు.
* ఎక్కువ సాంద్రత ఉన్న వ్యర్థాలను (10 వేల టీడీఎస్‌ ఉన్నవి) ఎంఇఇ (మల్టి పుల్‌ ఎఫెక్టివ్‌ ఏవాపరేటర్‌) పద్ధతిలో నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది.
* తక్కువ సాంద్రత ఉన్న వ్యర్థాలను (5వేల టీడీఎస్‌ ఉన్నవి) పీఇటీఎల్‌ లాంటి జల శుద్ధి కేంద్రాలకు తరలిం చాలి.
* ఉత్పత్తిలో వెలువడే ఆర్గానిక్‌ వ్యర్థాలను ఇన్సినరేటర్‌లో వేస్తూ నిర్వీ ర్యంచేయాల్సి ఉంటుంది.
* పరిశ్రమ ఆవరణలో ఒక వేల ఘన వ్యర్థాలను నిల్వ చేసేటప్పుడు వాటిని నేరు గా భూమి మీద కాకుండా కాంక్రీట్‌ ప్లాట్‌ ఫాం నిర్మించి దానిపై హెచ్‌డీపీఇ ప్లాస్టిక్‌ కవర్లపై వ్యర్థాలను నిల్వ చేయాలి. ఇలా చేయడం ద్వారా వ్యర్థాలు భూగర్భంలోకి ప్రవేశించే ఆస్కారం ఉండదు.
* అలాగే వ్యర్థాలను బహిరంగంగా నిల్వ చేయకుండా షెడ్‌ ఏర్పాటు చేయాలి. చర్యలకు సిఫార్సులు అరబిందో ఫార్మా పరిశ్రమ ఆవరణలో టన్నుల వ్యర్థాలు నిల్వ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.

బాయిలర్‌ వద్ద టీడీఎస్‌ వ్యర్థాలే 120 టన్నుల వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా పరిశ్రమ ఆవరణలో అదనంగా ఉన్న వ్యర్థాలు పరిశ్రమ వర్గాలు అధికారులకు తెలిపిన ప్రకారమే 150 టన్నులు. వాస్త వంగా వీరి వద్ద ఎటువంటి లాగ్‌ బుక్‌లు లేవు. ఏయే యూనిట్‌ల నుంచి ఎప్పు డెప్పుడు ఎంత మొత్తంలో వ్యర్థాలు సేక రించిందీ వివరాలు కానరావడం లేదు. లెక్కాపత్రం లేకుండా ఇష్టవచ్చినట్లు వ్యర్థాలను సేకరిచినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా పరిశ్రమ ఆవరణలో సుమారు 400 టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అధికారులు నిర్థారించినట్లు సమాచారం.

అయితే దీనికి సంబంధించి అదనపు సమాచారం కోసం పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులను 'ఆన్‌లైన్‌' సంప్రదిస్తే వివరాలు తెలపడానికి నిరా కరించారు. అరబిందో పరిశ్రమకు ఉన్న పలుకుబడిని పరిగణలోకి తీసుకుంటున్న సదరు అధికారులు నోరుమెదపడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి పరిశ్రమపై చర్యల కు సిఫార్సులు చేసినట్లు సమాచారం. వ్యర్థాలను పరిశ్రమ ఆవరణ నుంచి దుండి గల్‌ 'రాంకీ' టీఎస్‌డీఎఫ్‌ ప్లాంటుకు శుద్ధి, నిల్వ కోసం తరలించాల్సిందిగా ఆదేశించి నట్లు సంగారెడ్డి పీసీబీ ప్రాంతీయ అధికారి గౌడ్‌ తెలిపారు. పీసీబీ సభ్యకార్య దర్శి రాజేశ్వర్‌ తివారీ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శనివారం ఆయన నగరానికి రానున్నారు. తివారీ రావడంతోనే పరిశ్రమపై చర్యలు తీసుకుంటారని పీసీబీ అధికారులు చెబు తున్నారు.



ఆంధ్రజ్యోతి దినపత్రికకు కృతజ్ఞతలతో

Friday, May 23, 2008

సూర్యుడి లో కుంచెను ముంచి ఆకాశంలో రంగులు వేద్దాం

సాక్షి దినపత్రిక ఈ రోజు (23 మే) ఒక పూర్తి పేజీని పర్యావరణవార్తలు-వ్యాసాలకు కేటాయించింది.సూర్యుడి లో కుంచెను ముంచి ఆకాశంలో రంగులు వేద్దాం అంటూ ఒకటి,2035 నీరులేని నగరం గురించి సినీదర్సకుడు శేఖర్ కపూర్ ఆలోచనలు,బీచ్ లను మనమెందుకు బాగు చేయాలి అంటూ మరొకటి వ్యాసాలను మంచి చిత్రాలతో ప్రచురించారు.పిల్లలలో(పెద్దలకు కూడా)అవగాహన పెంపొందే విధంగా వ్యాసాలను ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక వారికి ధన్యవాదాలు.సదరు వ్యాసాలను చదువుకునేందుకు వీలుగా ఆయా చిత్రాలపై క్లిక్కవలసిందిగా మనవి.








Thursday, May 22, 2008

జీవ వైవిధ్యానికి తెలుగు పత్రికల నివాళి






ఈనాడు,వార్త,సాక్షి,ఆంధ్రజ్యోతి దినపత్రికల నుండి

Wednesday, May 21, 2008

డబ్బు మీద కొందరు మనుషులకుండే కక్కుర్తి


బ్బు మీద కొందరు మనుషులకుండే కక్కుర్తి ఎంతపనైనా చేయిస్తుంది.కాసిని కాసులకోసం జనావాస ప్రాంతాల్లో కాలకూటవిషాన్ని ఏళ్ళతరబడి భూగర్భంలోకి వదులుతున్నారు.కేవలం కొద్దిమంది స్వార్ధానికి ఎన్ని జీవితాలు వీళ్ళను తిట్టుకుంటూ ఇక పై గడపనున్నారో తలచుకుంటే గుండె చెరువౌతుంది.






బుధవారం,మే 21సాక్షి,వార్త ,ఈనాడు దినపత్రికలనుండి
వికటకవి గారు,ధన్యవాదాలు మీరు చెప్పాక ఈనాడు క్లిప్పింగ్ కూడా జతచెసాను.

Tuesday, May 20, 2008

మరికొన్ని ఆకుపచ్చ వార్తలు






సాక్షి,ఈనాడు,ఆంధ్రజ్యోతి,వార్త దినపత్రికల నుండి

Monday, May 19, 2008

ప్రప్రధమ పర్యావరణ పరిరక్షకుడు,ప్రబోధకుడు బుద్ధభగవాన్ జయంతి









ఆంధ్రజ్యోతి

ఈనాడు

ఆంధ్రజ్యోతి

Sunday, May 18, 2008

కూటికి ఎసరు బయో డీజిల్‌

కూటికి ఎసరు బయో డీజిల్‌

దండు కృష్ణవర్మ
ఇండోనేషియాలోని బాలీలో యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెంషన్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 314 వరకూ వాతావరణ మార్పులపై సదస్సు జరిగింది. దీనికి ప్రపంచం నలుమూలల నుండి 10 వేల మంది ప్రభుత్వ ప్రతినిధులు విచ్చేశారు. క్యొటో ప్రోటోకోల్‌కు 2012 లో గడువు తీరుతుంది. దీని కారణంగా మున్ముందు ఏం చేయాలని కూలంకషంగా చర్చలు జరిగాయి.

రానున్న కాలంలో వాతావరణ మార్పులను మనిషే శాసించనున్నాడు. ఉపద్రవాల బారినుండి మానవ సమాజ రక్షణకు యింకా సంసిద్ధతలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో కార్బన్‌డైయాక్సైడ్‌ ఉత్పత్తి, విసర్జన పెరుగుతుంది. ప్రపంచ బ్యాంక్‌ సూపర్‌హైవేస్‌, థర్మల్‌ పవర్‌ సూపర్‌ హైవేస్‌, వ్యవసాయ పారిశ్రామికీకరణకు యిబ్బడి ముబ్బడిగా నిధులను కేటాయిస్తుంది. అనేకదేశాలను గ్రీన్‌హవుస్‌ గ్యాసెస్‌ విసర్జనకు దోహదం చేస్తుంది. కార్గిల్‌, వాల్‌మార్ట్‌లు స్థానికంగా ఆర్థిక విధానాలకు గొడ్డలి పెట్టులా వ్యవహరిస్తున్నాయి. కార్గిల్‌ అమెజాన్‌లో సోయా ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. ఇండోనేషియాలో పామాయిల్‌ మొక్కల పెంపకాన్ని చేపట్టింది. దీని పర్యవసానం అడవులు నాశనమైనాయి. వాల్‌మార్ట్‌ పుణ్యమా యని సుదూర ప్రాంతాలలో కార్బన్‌డైయాక్సైడ్‌ విసర్జన పెరిగింది. రియోలో ధరిత్రీ సమావేశం తర్వాత క్యోటో, కార్బన్‌ డయాక్సైడ్‌ అధిక విసర్జన దేశాలను భారీ మూల్యం చెల్లించాలని హెచ్చరించింది. వాతావరణంలో తాపం రాను రాను పెరుగుతుంది. రాను రాను మనం కేసినో ఆర్థిక విధానాలను గోచరిస్తున్నాం, ప్రకృతిని పణంగా పెట్టి అధిక లాభార్జనే కేసినో లక్ష్యంగా కనబడుతుంది. బయో ఫ్యూయల్స్‌ పేరున జట్రోఫా, పామ్‌ఆయిల్‌, జొన్న,సోయాపై దృష్టి సారించడం ఎండమావిలాంటిదే. గ్రామీణ వికేంద్రీకరణ లక్ష్యంగా ఎనర్జీ పెంపుదలకు కృషి జరగాలి. బయోమాస్‌ను ఆవు పిడకల నుండి పొందవచ్చును. చిరుధాన్యాలు ఉత్పత్తిని పెంచటం, వనములను పెంచడం ద్వారా బయోఫ్యూయల్స్‌ను పొందగలం.

పారిశ్రామికీకరణ ద్వారా ఉత్పన్నం అయ్యే ఫ్యూయల్స్‌ పేదరికాన్ని అరికట్టలేవు. విద్యుత్‌, రవాణా ప్రధానమైనవి, ఎధనాల్‌, బయోడీసెల్‌ ఈమధ్యకాలంలో ఊపందుకుంటున్నాయి. కార్బన్‌డైయాక్సైడ్‌ విసర్జనను కొంతవరకు వీటి ఉత్పత్తి ద్వారా నివారించవచ్చు. అమెరికా అధ్యక్షుడు బుష్‌ ఏకంగా బయోఫ్యూయల్స్‌ వినియోగాన్ని పెంచేందుకు చట్టాన్నే తేనున్నారు. ఆ దేశ లక్ష్యంగా 2017 కల్లా 35 బిలియన్ల గేలన్ల బయో ఫ్యూయల్స్‌ వారు నిర్ణయించారు. సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎఫ్‌ఎఓ) అధినేత ఎమ్‌.అలెగ్జాండర్‌ ఏమంటారండీ, రానున్న 1520 సంవత్సరాలలో ప్రపంచ ఎనర్జీలో 25 శాతాన్ని బయో ఫ్యూయల్స్‌ ద్వారా పొందుతాం అంటే రాను రాను పెట్రోల్‌కు దూరం అవుతాం. బయోఫ్యూయల్స్‌ పై దృష్టి సారించి చట్టాలు తెచ్చిన దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, కొలంబియా, భారత్‌, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పిన్స్‌, దక్షిణాఫ్రికా, కొలంబియా, థాయ్‌లాండ్‌. పారిశ్రామికంగా బయో ఫ్యూయల్స్‌ను ఇథనాల్‌, బయోడీసెల్‌ నుండి లభిస్తాయి. ఇధనాల్‌ను సాక్యరోస్‌, మొలాసెస్‌, మైస్‌, బార్లీ, గోధుమలలో పుష్కలంగా ఉన్నాయి. బయోడీసెల్‌ పామ్‌ఆయిల్‌,సోయా, రేప్‌సీడ్‌ ఆయిల్‌లో ఉన్నాయి. బయోడీసెల్‌ను డీసెల్‌లోనూ, ఇథనాల్‌ను పెట్రోల్‌లో మిళితం చేయవచ్చు.

బ్రెజిల్‌, బొలీవియా, కోస్టారీకా, కొలంబియా, గౌతమేలాలో సామాజిక ఉద్యమాలు బయోడీసెల్‌కై ప్రారంభమైనాయి. పొట్టలు కొట్టిన పుల్‌ టాంకులంటూ పెట్రోల్‌ డీజెల్‌ వాడకాలను తగ్గిస్తున్నారు. అమెరికా, బ్రెజిల్‌లో ఎథినాల్‌ పరిశ్రమలు పెరిగాయి. యూరప్‌లో కూడా ఎధనాల్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఎధనాల్‌ వాడకం పెరిగితే వరిధాన్యాల ఉత్పత్తి కొరవడుతుందని బ్రెజిల్‌లో భూమిలేని నిరుపేదలు టాంకల కోసమై పొట్టలు కొట్టవద్దంటున్నారు, మెక్సికోలో ఆహారధాన్యాల రేటు పెరగటంతో ఆందోళనలు పెరిగాయి. ఒక టన్ను మొక్కజొన్న 413 లీటర్ల ఎధనాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాలక్రమేణా మెక్సికో అమెరికాపై ఆధారపడి చిన్నకారు రైతులఉసురుకు నోచుకుంది. బయోఫ్యూయల్‌కై మొక్కజొన్నను తరలించడంతో తిండికైజొన్న రేట్లు పెరిగాయి. పామ్‌ ఆయిల్‌, సోయా ఉత్పత్తుల కోసమై అడవులను నాశనం చేస్తున్నారు. దీనికారణాన కార్బన్‌డైయాక్సైడ్‌ విసర్జన శాతం పెరిగింది. ఇండోనేషియాలో బయోఫ్యూయల్స్‌ ఉత్పత్తుల కారణాన రైన్‌ ఫారెస్ట్స్‌ అంతరించిపోతున్నాయి.

వెట్‌లాండ్స్‌ ఇంటర్నేషనల్‌ గణాంకాల ననుసరించి దక్షిణాసియా దేశాలలో పామ్‌ ఆయిల్‌ పంట పెరిగిన కారణాన కార్బన్‌డైయాక్సైడ్‌ విసర్జనల శాతం పెరిగింది. ప్రతి టన్ను పామాయిల్‌కు 30 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ విసర్జన జరుగుతుంది. బయో ఫ్యూయల్స్‌ కారణాన భూమిలో తాపం పెరుగుతుంది. అమెరికాలో 20 శాతం జొన్న ఉత్పత్తులనుండి ఐదు బిలియన్ల గ్యాలన్ల ఎథనాల్‌ ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఒక శాతం ఆయిల్‌కు ప్రత్యామ్నాయం బయో ఫ్యూయల్‌ వినియోగం గాలన్‌ ఎధనాల్‌ ఉత్పత్తికి 1700 గాలన్ల నీరు అవసరం ఉంటుంది. మొక్కజొన్న సేద్యానికి ఎక్కువ నత్రజని, పురుగుమందులు, ఎరువులు అవసరం ఉంటాయి. స్పెర్న్‌రిపోర్ట్‌ ప్రకారం కార్బన్‌డయాక్సైడ్‌ విసర్జనలు అడవులను అంతమొందించి వ్యవసాయం కారణంగా 18 శాతం రవాణా వలన 14 శాతం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంతోలోతు నుండి నీటిని పంప్‌ చేయడం కారణంగానూ, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం కారణాన ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ విసర్జన వుంటుంది. దీనికి పరిష్కారం ఏమంటే, సేంద్రీయ వ్యవసాయం, స్థానికంగా ప్రకృతి సిద్ధంగా మనకు లభించిన వనరులను సరిగా ఉపయోగిస్తే కార్బన్‌డయాక్సైడ్‌ విసర్జన శాతం తగ్గుతుంది. ఆహార పదార్థాలలో నాణ్యత వుంటుంది. వ్యవసాయాన్ని పారిశ్రామీకరణ చేయకూడదు. ప్రకృతికి విఘాతం కల్గించకుండా సమతుల్యాన్ని పాటిస్తే,వాతావరణం కూడా అనుకూలిస్తుంది.

ఆంధ్రప్రభ దినపత్రిక కు కృతజ్ఞతలతో

http://andhraprabha.com/NewsItems.asp?ID=APV20080514041400&Title=Articles+%2F+Columns&lTitle=%AAy%F9ry%CC%C1V+%2F+%AAy%F9%C6%D8%F9%83y%CC%C1V&Topic=0

Saturday, May 17, 2008

వార్త దినపత్రిక నుంచి మూడు పచ్చని వార్తలు



ప్రపంచమే ఒక పచ్చని పూలతోట

Visual Aid provided by NASA Jan. 2005
ఇది ప్రతివారూ స్వార్ధం పెంచుకుని,నేనేమిటి,నాపిల్లల భవిష్యత్తు ఏమిటీ అని ఒకటికి పది సార్లు ఆలోచించుకుని మరీ గడపదాటి బయటకు అడుగుపెట్టాల్సిన సమయం ఇది.కాకపోతే,నేను అంటే మనం,నాపిల్లలు అనగా అందరి పిల్లలు వారి భవిత అన్న విస్తృతార్ధం లో స్వార్ధచింతన పెంచుకుంటే ప్రపంచమే ఒక పచ్చని పూలతోట అవుతుందని గ్రహించగలగాలి.
అందరికీ తెలిసిన విషయమే గుంటూరు లో ఎండలు ఎక్కువని,కానీ మా కాలేజీలో కానీ,హాస్టలు గదిలో కానీ మాకు ఏనాడూ,ఫ్యానులు లేకపోయినా కూడా చల్లచల్లకూల్ కూల్ అన్నట్లు గడపగలిగామంటే అది ఏనాడో ఆంగ్లేయులు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయఫలితం.మాకళాశాల కట్టడానికి వాడిన రాయి,ప్లాను ఇలాంటి వాటి గురించిన సాంకేతిక వివరాలు పెద్దగా తెలియకపోయినా అది కొండరాయి తో కట్టారని,అలాగే కట్టడంలొ కోడిగుడ్డు,బెల్లం,సున్నం వాడారని మాత్రం విన్నాను.అలాగే కాలేజీలో కొన్ని చోట్ల నిలబడితే గాలి విస్తారంగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేది, దానికీ గాలివాలును బట్టి అక్కడ కాసేపు నుంచుంటే?అన్న ఆలోచనతో కల్పించిన వెసులుబాటు.ఫిబ్రవరి,మార్చి,ఏప్రిల్ నెలల్లో మధ్యాహ్నం భోజనం అయ్యాక ,తరగతి గదిలోని చల్లదనానికి,ముందు బెంచీమీద పడి మరీ నిద్రపోవటం,మరి ముఖ్యంగా సైకాలజీ క్లాసులో చాలా సాధారణదృశ్యం,కానీ బియ్యే ఫైనల్ ఫలితాల్లో నాకు ఆసబ్జెక్టులో యూనివర్శిటీఫస్టు రావటం మా చార్లెస్ వెస్లీ సారుకీ మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినంత పనవ్వటం వేరే ముచ్చట..ఇంతకీ మీకు మాకాలేజీ పేరు చెప్పలేదుకదా ఆంధ్రక్రైస్తవకళాశాల(Andhra Christian,College)మాహాస్టలు పేరు ఉల్ఫ్ హాల్(wolf Hall).

తర్వాత యూనివర్శిటీలో చేరాను,విశ్వవిద్యాలయ స్థాపననాటినుంచి ఒక్క హాస్టలు రూములోకూడా చెమట,వేడి అన్నమాట వినిపించేది కాదు.1991-92 వరకూ హాస్టలు గదుల్లో ఫ్యానులుండేవి కాదంటే నమ్మగలరా?ఇప్పటికీ క్యాంపస్ లో చెట్లకిందకూర్చుని రోజులతరబడి గడపటం,ఊటీ,సిమ్లాల్లో విహరించటం కన్నా ఎక్కువ అని నా ప్రగాఢవిశ్వాసం.నేను యం.యే చేరిన నాటికీ ఇప్పటికీ మెయిన్ క్యాంపస్లో గానీ,అనుబంధకళాశాలల్లో చాలా కొత్తకట్టడాలు వచ్చాయి,కానీ నూతనభవనాల్లో ఫ్యానులు కాదు కదా ఏసీలేకపోతే ఉండలేము అనిపిస్తుంది.ఎందుకొచ్చిన మార్పు ఇది?భవననిర్మాణరంగంలో చాలా పురోగతి ఉన్నా,వేడి,ఉక్కపోతలను తగ్గించలేకపోగా,ఎయిర్ కండిషనింగ్ లేకపోతే బతకలేము లోపల అన్న స్థితి రావటానికి బయట పెరుగుతున్న వేడిమి కారణం ప్రధానంగా.

ఇది ఒక్క విశాఖపట్నానికో,గుంటూరుకో కాక విశ్వవ్యాప్తంగా సంభవిస్తున్న సమకాలీన విషాదాల్లో పెరుగుతున్న భూతాపం పతాకశీర్షికలకు అర్హమైంది.పెరుగుతున్నభూతాపం కొన్ని దేశాల వల్ల కొంత ఎక్కువ,మరికొన్ని దేశాల్లో తక్కువగా ఉండొచ్చు కానీ,తద్వారా సంభవించబోయే,సంభవిస్తున్న దుష్పరిణామాలకు మాత్రం ప్రపంచంలోని ఏఒక్కరూ,చివరకు ఒక్క అంగుళం కూడా మినహాయింపు కాని దినాలు రాబోతున్నాయి.అభివృద్ధికి సూచికలుగా ఒకనాడు పరిగణించబడ్డ ప్రతిదీ ఇవ్వాళ ఒక శత్రువుగా రూపాంతరం చెందాయా అన్నంత స్థాయిలో ఇవ్వాళ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.వినిమయవాదం పెచ్చరిల్లిన ఈనాటి సమాజం లో అన్నదాతైన రైతుగూర్చి పట్టించుకున్న పత్రికలు,టీవీచానళ్ళు,వెబ్సైట్లు,పోర్టల్స్ లేనప్పుడు(కనీసం తెలుగులో),ఇక భూతాపం పెరుగుదల,కరిగిపోతున్న గ్లేసియర్లు,గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇలాంటి వాటి గురించి రాసెదెవ్వరు,సాధారణ ప్రజానీకానికి తెలియజెప్పేదెవ్వరు?
నడమంత్రపు సిరులు తెచ్చిన జీవనశైలి లోని మార్పులు కొన్ని,మరికొన్ని కొనకపోతే ప్రధానజనజీవన స్రవంతి నుంచి వెలివేస్తారేమోనని తెచ్చి నింపుతున్న వస్తుశ్రేణులవల్ల,మనం ఇళ్ళల్లో వాడుతున్న బల్బుల దగ్గరనుంచీ,ఫ్రిజ్,టీవీ,ఏసీ,వాషింగ్ మిషన్,ఫ్యాన్లు,ద్విచక్రవాహనాలు,కార్లు,..ఈ జాబితా అనంతం అన్నిటి వల్లా భూతాపం పెరుగుతూనే ఉంటుంది.అలాఅని వీటి వాడకాన్ని మానమని ఎవరూ అనరు,కానీ వాడకంలో కాస్త వివేచన,మరి కాస్త పిసినారితనం పెంచుకోమని అభ్యర్దిస్తున్నారు పర్యావరణకార్యకర్తలు.త్వరలో రానున్న బత్తీబంద్ కార్యక్రమం వల్ల ఆకాశానికో,లేక ఓజోన్ పొరకో పడుతున్న చిల్లులు పూడిపోతాయని ఎవరూ దురాశపడటంలేదు.కానీ కొంత సమయం ఇంటిలోని దీపాలకు శెలవు ఇవ్వటం అదీ రాత్రి వేళల్లో,ఇంటిల్లిపాదినీ ఈ భూతాపంపెంపు నుంచి మినహాయింపు పొందేందుకు చేస్తున్న కృషిలో ప్రత్య్క్షక్షంగా భాగస్వాములని చేసి ఒక అవగాహనను పెంచే చిరుప్రయత్నం మాత్రమే అని గ్రహించాలి.ఒక గంట దీపాలకు విరామం ఇవ్వటం వల్ల ఇంటిలోని మిగిలిన ఎలక్ట్రానిక్,ఎలక్ట్రికల్ పరికరాలకన్నిటికీ కూడా కాస్త పనితగ్గుతుంది,ముఖ్యంగా విరామమెరుగక వాగే టీవీలకు,అలాగె ఆ కాసేపూ ఇంటిల్లపాదీ బయట నిలబడి ఆకాశాన్ని,చుక్కలనూ,మబ్బులనూ,చంద్రుడినీ చూసి మీపిల్లలకు మీరు పిల్లలు గా ఉన్నప్పుడు చూసిన ఆకాశంలో ఏనుగులు,గుర్రాల కధలు చెప్పొచ్చు.అందరూ అలా నిలబడి మేఘాలను తిలకించి ఎన్నేళ్ళయ్యిందంటారు?

కొత్తపాళీ గారు చేపట్టిన ఈ "వెలుగులను మిగిల్చే" కార్యక్రమానికి తలా ఒక రూపంలో సాయపడదాం.

Monday, May 12, 2008

మీరు డోవ్(Dove) సబ్బు వాడుతున్నారా?

డోవ్ సబ్బుల వాడకంలో ఉపయోగించే పామ్ ఆయిల్ కోసం అమెరికాకు చెందిన యునిలీవర్ కంపెనీ వారు,ఇండోనేషియాకు చెందిన అడవులను,వాటిలోని,సమస్తజీవజాలాన్ని నాశనం చేస్తూ గ్లోబల్ వార్మింగ్ ను ఎలా పెంచుతున్నారో ఇక్కడ చూడొచ్చు.అలాగే ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు గ్రీన్ పీస్ సంస్థ రూపొందించిన బహిరంగలేఖపై సంతకం చేయండి ఇక్కడ నొక్కి.
http://www.greenpeace.org/international/campaigns/forests/asia-pacific/dove-palmoil-action

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO