డబ్బు మీద కొందరు మనుషులకుండే కక్కుర్తి
డబ్బు మీద కొందరు మనుషులకుండే కక్కుర్తి ఎంతపనైనా చేయిస్తుంది.కాసిని కాసులకోసం జనావాస ప్రాంతాల్లో కాలకూటవిషాన్ని ఏళ్ళతరబడి భూగర్భంలోకి వదులుతున్నారు.కేవలం కొద్దిమంది స్వార్ధానికి ఎన్ని జీవితాలు వీళ్ళను తిట్టుకుంటూ ఇక పై గడపనున్నారో తలచుకుంటే గుండె చెరువౌతుంది.
బుధవారం,మే 21సాక్షి,వార్త ,ఈనాడు దినపత్రికలనుండి
వికటకవి గారు,ధన్యవాదాలు మీరు చెప్పాక ఈనాడు క్లిప్పింగ్ కూడా జతచెసాను.
4 Comentários:
అవునండీ, ఇది ఈనాడులో కూడా చదివాక ఒళ్ళు మండిపోయింది. ఏ మాత్రం నీతి లేకుండా ఇతరుల జీవితాలతో చెలగాటాలాడుకునే ఇలాంటి వాళ్ళకి గట్టి శిక్షలు వెయ్యాలి. ఇలాంటి నేరాలు హత్యలకేమీ తీసిపోవు.
జీడిమెట్ల వ్యర్ధాలు స్టేషన్ ఘనాపూర్ నీళ్లని కలుషితం చేశాయా? మధ్యలో పులుల గొడవేంటి? అంతా గందరగోళంగా ఉంది. పై మూడు వార్తలూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి కదా - ఒకటి రసాయన వ్యర్ధాల గురించి, రెండోది పులుల గురించి, మూడోది మినరల్ వాటర్ గురించి. ఈ మూడిటికీ గల పోలికేంటి తిరుమలేశా? ఈనాడులో మినరల్ వాటర్ గురించి చదివి వికటకవిగారికి గుండె రగిలిపోవటమేంటి!?!
అబ్రకదబ్ర గారు,మిమ్మల్ని కాస్త గందరగోళానికి గురి చెసినందుకు మన్నించాలి.అసలు ఈ పిచుకలు అనే బ్లాగు పర్యావరణ అవగాహన పెంచేందుకు గాను మొదలుపెట్టింది.అందుకు గాను వివిధసోర్స్ నుంచి వార్తలు సేకరించి ఇక్కడ తరచూ పెడుతుంటాను.కొన్నివార్తలకు మరొకదానితో సంబంధముండొచ్చు,మరికొన్నిటికి లేకపోవచ్చు.గమనించగలరు,పైన ఉన్న పుడమి గొంతులో గరళం,భారీగా వ్యర్ధరసాయనాలు ..అన్నవి ఒక్క వార్తే కాకుంటే సాక్షిలో కాస్త వివరంగా ఇచ్చారు ఈనాడులో సిటీ ఎడిషన్ లో ఒక మూల పడేశారు .వికటకవి గారు చెప్పాక దాన్నీ జోడించాను.
ఇప్పుడర్ధమయింది :-) విడమర్చినందుకు ధన్యవాదాలు.
Post a Comment