Saturday, May 24, 2008

ఆ వ్యర్థాలు సేకరించింది డాక్టర్‌ రెడ్గీస్‌ నుంచే...,మరో వ్యర్థ బాగోతం - ఈసారి 'అరబిందో'

ఆ వ్యర్థాలు సేకరించింది డాక్టర్‌ రెడ్గీస్‌ నుంచే...

హైదరాబాద్‌, మే 24 ః జీడిమెట్ల వ్యర్థాల డంపింగ్‌ కేసు మరో మలుపు తిరి గింది. వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించిన బాలాజీ ఫ్లెక్సో కార్మికులు పోలీసుల వద్ద డాక్టర్‌ రెడ్డీస్‌ పేరు బయటపెట్టారు. డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన పరిశ్రమల నుంచి సేకరించిన సాల్వెంట్ల నుంచే సీరా తయారు చేసేవారమని కార్మికులు పోలీసులకు వివరిం చారు. అదే విధంగా గోదాములో ఉన్న డ్రమ్ములు సైతం డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి తీసుకుని వచ్చినవేనని వారు వాగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పటికే అక్కడ ఉన్న డ్రమ్ముల్లో రెడ్డీస్‌ లేబుల్స్‌ స్పష్టంగా కనిపించాయి. అయితే కార్మి కులు సైతం అదే విషయాన్ని స్పష్టం చేయడం విశేషం. ఇప్పుడు బంతి కాలుష్య నియంత్రణ మండలి అధి కారుల కోర్టులోకి వెళ్లింది.

చాంద్‌పాషా, ఆసిఫ్‌ల కోసం గాలింపు వ్యర్థ రసాయనాలు డంపింగ్‌ జరిపిన ప్రదేశం మెహదీపట్నం నివాసి ఆసీఫ్‌ సోదరులదిగా గుర్తించిన పోలీసులు దర్యాపులో భాగంగా వారికి సంబంధించిన మరో పరిశ్రమ బాలాజీ ఫ్లెక్సోపై దాడులు నిర్వహించి అక్కడ పనిచేస్తున్న కార్మికులు నరేష్‌, వకీల్‌, విజయ్‌కుమార్‌, ధర్మా, చిన్నాలను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పరిశ్రమలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నరేష్‌ తమ యజమాని ఆసీఫ్‌ వద్ద ఆ స్థలాన్ని చాంద్‌పాషా అనే వ్యక్తి లీజుకు తీసుకుని ఈ డంపింగ్‌కు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు.

అంతే కాకుండా తమ పరిశ్రమకు కావలసిన సాల్వెంట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ నుంచి వస్తుంటాయని, పలు మార్లు సాల్వెంట్లతో పాటు వ్యర్థ రసాయన డ్రమ్ములు కూడా అధిక సంఖ్యలో వస్తాయని ఆయన పోలీసుల విచారణలో తెలిపాడు. నరేష్‌ తెలిపిన సమాచారం మేరకు జీడిమెట్ల పోలీసులు చాంద్‌ పాషా కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థల యజమానులు ఆసీఫ్‌ సోదరులు, లీజుకు తీసుకున్న చాంద్‌ పాషా పరారీలో ఉన్నారు.

************************************************************************************

మరో వ్యర్థ బాగోతం - ఈసారి 'అరబిందో'

హైదరాబాద్‌, మే 24 ః జీడిమెట్లలో ఓ అక్రమ డంప్‌ వెలుగుచూసి నాలుగు రోజులు కాకముందే దానికి సమీపంలోని మరో పారిశ్రామిక వాడలో అక్రమ రసాయనాల నిల్వలు బ యటపడ్డాయి. జనావాసాల నడుమ విష రసాయనాలను వదలడం, భూగర్భంలో, నాలాల్లో డంప్‌ చేయడం, అక్రమంగా వ్యర్థాలను నిల్వ చేయడం నేరమని తెలిసీ వాళ్లీ పని చేస్తుంటే ఏమనగలం ? ఇలాంటి నేరాలు ఎన్ని వెలుగు చూసినా 'వాటిని మేమరగం' అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుంటే ఏం చేయగలం? మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం గ్రామ సమీపంలో ఉన్న 'అరబిందో ఫార్మా' యూనిట్‌ -5లో వెలుగు చూసిన అక్రమ విష రసాయనాల బాగోతం చదివితే అసలు విషయం అర్థమవుతుంది. పాశమైలారం గ్రామం నుంచి పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు కాలుష్యంపై ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్రవారం పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పారిశ్రామిక వాడపై దండయాత్రకు వెళ్లారు.

ఈ క్రమంలోనే అరబిందో ఫార్మా యూనిట్‌-5 పరిశ్రమ పక్కనే నిర్మించిన మరో ప్లాంట్‌లో అక్రమ వ్యర్థాల నిల్వలు వారి కంటపడ్డాయి. అరబిందోకు చెందిన ఇతర యూనిట్ల నుంచి వ్యర్థాలను పెద్ద ఎత్తున అక్కడ డంప్‌ చేస్తున్నట్లు స్పష్టమైంది. అశాస్త్రీయంగా భూమిలో ఘన వ్యర్థాలను నిల్వ ఉంచడాన్ని పసిగట్టారు. ఈ తంతుకు కాపలాగా పరిశ్ర మ యాజమాన్యం సెక్యూరిటీ సిబ్బందిని నియమించింది. నిబంధనలకు పాతర పర్యావరణ నిబంధనల ప్రకారం రసాయనాల ఉత్పత్తిలో వెలువడే వ్యర్థాలను వాటి తీవ్రతను బట్టి శుద్ధి చేయాల్సి ఉం టుంది. ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని హైదరాబాద్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌కు నిల్వ కోసం తరలించాలి. ఈ విధంగా టన్ను ఘన వ్యర్థాలకు రూ. 25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా రసాయన జలా లను పటాన్‌చెరు ఎన్విరోటెక్‌ లిమిటెడ్‌ (పిఇటిఎల్‌)కు శుద్ధి కోసం పంపాలి. అటు వంటిది అరబిందో ఫార్మా తద్విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పాశమైలారం పారిశ్రామిక వాడకు సమీపంలో ఉన్న ఇతర అనుబంధ ఫార్మా కంపెనీల యూనిట్‌ల నుంచి వెలువ డుతున్న వ్యర్థాలను సేకరించి యూనిట్‌-5 సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి అక్ర మంగా రవాణా చేస్తూ సమీప పరిసరాల్లో, మరెక్కడో డంప్‌ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ నిబంధనలు

* పరిశ్రమ ఉత్పత్తిలో వెలువడే రసా యన వ్యర్థాలను ముఖ్యంగా ఆర్గానిక్‌ వ్యర్థా లను మూడు మాసాలకు మించి నిల్వ ఉంచడానికి వీలులేదు.
* ఎక్కువ సాంద్రత ఉన్న వ్యర్థాలను (10 వేల టీడీఎస్‌ ఉన్నవి) ఎంఇఇ (మల్టి పుల్‌ ఎఫెక్టివ్‌ ఏవాపరేటర్‌) పద్ధతిలో నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది.
* తక్కువ సాంద్రత ఉన్న వ్యర్థాలను (5వేల టీడీఎస్‌ ఉన్నవి) పీఇటీఎల్‌ లాంటి జల శుద్ధి కేంద్రాలకు తరలిం చాలి.
* ఉత్పత్తిలో వెలువడే ఆర్గానిక్‌ వ్యర్థాలను ఇన్సినరేటర్‌లో వేస్తూ నిర్వీ ర్యంచేయాల్సి ఉంటుంది.
* పరిశ్రమ ఆవరణలో ఒక వేల ఘన వ్యర్థాలను నిల్వ చేసేటప్పుడు వాటిని నేరు గా భూమి మీద కాకుండా కాంక్రీట్‌ ప్లాట్‌ ఫాం నిర్మించి దానిపై హెచ్‌డీపీఇ ప్లాస్టిక్‌ కవర్లపై వ్యర్థాలను నిల్వ చేయాలి. ఇలా చేయడం ద్వారా వ్యర్థాలు భూగర్భంలోకి ప్రవేశించే ఆస్కారం ఉండదు.
* అలాగే వ్యర్థాలను బహిరంగంగా నిల్వ చేయకుండా షెడ్‌ ఏర్పాటు చేయాలి. చర్యలకు సిఫార్సులు అరబిందో ఫార్మా పరిశ్రమ ఆవరణలో టన్నుల వ్యర్థాలు నిల్వ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.

బాయిలర్‌ వద్ద టీడీఎస్‌ వ్యర్థాలే 120 టన్నుల వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా పరిశ్రమ ఆవరణలో అదనంగా ఉన్న వ్యర్థాలు పరిశ్రమ వర్గాలు అధికారులకు తెలిపిన ప్రకారమే 150 టన్నులు. వాస్త వంగా వీరి వద్ద ఎటువంటి లాగ్‌ బుక్‌లు లేవు. ఏయే యూనిట్‌ల నుంచి ఎప్పు డెప్పుడు ఎంత మొత్తంలో వ్యర్థాలు సేక రించిందీ వివరాలు కానరావడం లేదు. లెక్కాపత్రం లేకుండా ఇష్టవచ్చినట్లు వ్యర్థాలను సేకరిచినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా పరిశ్రమ ఆవరణలో సుమారు 400 టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అధికారులు నిర్థారించినట్లు సమాచారం.

అయితే దీనికి సంబంధించి అదనపు సమాచారం కోసం పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులను 'ఆన్‌లైన్‌' సంప్రదిస్తే వివరాలు తెలపడానికి నిరా కరించారు. అరబిందో పరిశ్రమకు ఉన్న పలుకుబడిని పరిగణలోకి తీసుకుంటున్న సదరు అధికారులు నోరుమెదపడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి పరిశ్రమపై చర్యల కు సిఫార్సులు చేసినట్లు సమాచారం. వ్యర్థాలను పరిశ్రమ ఆవరణ నుంచి దుండి గల్‌ 'రాంకీ' టీఎస్‌డీఎఫ్‌ ప్లాంటుకు శుద్ధి, నిల్వ కోసం తరలించాల్సిందిగా ఆదేశించి నట్లు సంగారెడ్డి పీసీబీ ప్రాంతీయ అధికారి గౌడ్‌ తెలిపారు. పీసీబీ సభ్యకార్య దర్శి రాజేశ్వర్‌ తివారీ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శనివారం ఆయన నగరానికి రానున్నారు. తివారీ రావడంతోనే పరిశ్రమపై చర్యలు తీసుకుంటారని పీసీబీ అధికారులు చెబు తున్నారు.



ఆంధ్రజ్యోతి దినపత్రికకు కృతజ్ఞతలతో

Seja o primeiro a comentar

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO