Sunday, May 18, 2008

కూటికి ఎసరు బయో డీజిల్‌

కూటికి ఎసరు బయో డీజిల్‌

దండు కృష్ణవర్మ
ఇండోనేషియాలోని బాలీలో యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెంషన్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 314 వరకూ వాతావరణ మార్పులపై సదస్సు జరిగింది. దీనికి ప్రపంచం నలుమూలల నుండి 10 వేల మంది ప్రభుత్వ ప్రతినిధులు విచ్చేశారు. క్యొటో ప్రోటోకోల్‌కు 2012 లో గడువు తీరుతుంది. దీని కారణంగా మున్ముందు ఏం చేయాలని కూలంకషంగా చర్చలు జరిగాయి.

రానున్న కాలంలో వాతావరణ మార్పులను మనిషే శాసించనున్నాడు. ఉపద్రవాల బారినుండి మానవ సమాజ రక్షణకు యింకా సంసిద్ధతలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో కార్బన్‌డైయాక్సైడ్‌ ఉత్పత్తి, విసర్జన పెరుగుతుంది. ప్రపంచ బ్యాంక్‌ సూపర్‌హైవేస్‌, థర్మల్‌ పవర్‌ సూపర్‌ హైవేస్‌, వ్యవసాయ పారిశ్రామికీకరణకు యిబ్బడి ముబ్బడిగా నిధులను కేటాయిస్తుంది. అనేకదేశాలను గ్రీన్‌హవుస్‌ గ్యాసెస్‌ విసర్జనకు దోహదం చేస్తుంది. కార్గిల్‌, వాల్‌మార్ట్‌లు స్థానికంగా ఆర్థిక విధానాలకు గొడ్డలి పెట్టులా వ్యవహరిస్తున్నాయి. కార్గిల్‌ అమెజాన్‌లో సోయా ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. ఇండోనేషియాలో పామాయిల్‌ మొక్కల పెంపకాన్ని చేపట్టింది. దీని పర్యవసానం అడవులు నాశనమైనాయి. వాల్‌మార్ట్‌ పుణ్యమా యని సుదూర ప్రాంతాలలో కార్బన్‌డైయాక్సైడ్‌ విసర్జన పెరిగింది. రియోలో ధరిత్రీ సమావేశం తర్వాత క్యోటో, కార్బన్‌ డయాక్సైడ్‌ అధిక విసర్జన దేశాలను భారీ మూల్యం చెల్లించాలని హెచ్చరించింది. వాతావరణంలో తాపం రాను రాను పెరుగుతుంది. రాను రాను మనం కేసినో ఆర్థిక విధానాలను గోచరిస్తున్నాం, ప్రకృతిని పణంగా పెట్టి అధిక లాభార్జనే కేసినో లక్ష్యంగా కనబడుతుంది. బయో ఫ్యూయల్స్‌ పేరున జట్రోఫా, పామ్‌ఆయిల్‌, జొన్న,సోయాపై దృష్టి సారించడం ఎండమావిలాంటిదే. గ్రామీణ వికేంద్రీకరణ లక్ష్యంగా ఎనర్జీ పెంపుదలకు కృషి జరగాలి. బయోమాస్‌ను ఆవు పిడకల నుండి పొందవచ్చును. చిరుధాన్యాలు ఉత్పత్తిని పెంచటం, వనములను పెంచడం ద్వారా బయోఫ్యూయల్స్‌ను పొందగలం.

పారిశ్రామికీకరణ ద్వారా ఉత్పన్నం అయ్యే ఫ్యూయల్స్‌ పేదరికాన్ని అరికట్టలేవు. విద్యుత్‌, రవాణా ప్రధానమైనవి, ఎధనాల్‌, బయోడీసెల్‌ ఈమధ్యకాలంలో ఊపందుకుంటున్నాయి. కార్బన్‌డైయాక్సైడ్‌ విసర్జనను కొంతవరకు వీటి ఉత్పత్తి ద్వారా నివారించవచ్చు. అమెరికా అధ్యక్షుడు బుష్‌ ఏకంగా బయోఫ్యూయల్స్‌ వినియోగాన్ని పెంచేందుకు చట్టాన్నే తేనున్నారు. ఆ దేశ లక్ష్యంగా 2017 కల్లా 35 బిలియన్ల గేలన్ల బయో ఫ్యూయల్స్‌ వారు నిర్ణయించారు. సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎఫ్‌ఎఓ) అధినేత ఎమ్‌.అలెగ్జాండర్‌ ఏమంటారండీ, రానున్న 1520 సంవత్సరాలలో ప్రపంచ ఎనర్జీలో 25 శాతాన్ని బయో ఫ్యూయల్స్‌ ద్వారా పొందుతాం అంటే రాను రాను పెట్రోల్‌కు దూరం అవుతాం. బయోఫ్యూయల్స్‌ పై దృష్టి సారించి చట్టాలు తెచ్చిన దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, కొలంబియా, భారత్‌, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పిన్స్‌, దక్షిణాఫ్రికా, కొలంబియా, థాయ్‌లాండ్‌. పారిశ్రామికంగా బయో ఫ్యూయల్స్‌ను ఇథనాల్‌, బయోడీసెల్‌ నుండి లభిస్తాయి. ఇధనాల్‌ను సాక్యరోస్‌, మొలాసెస్‌, మైస్‌, బార్లీ, గోధుమలలో పుష్కలంగా ఉన్నాయి. బయోడీసెల్‌ పామ్‌ఆయిల్‌,సోయా, రేప్‌సీడ్‌ ఆయిల్‌లో ఉన్నాయి. బయోడీసెల్‌ను డీసెల్‌లోనూ, ఇథనాల్‌ను పెట్రోల్‌లో మిళితం చేయవచ్చు.

బ్రెజిల్‌, బొలీవియా, కోస్టారీకా, కొలంబియా, గౌతమేలాలో సామాజిక ఉద్యమాలు బయోడీసెల్‌కై ప్రారంభమైనాయి. పొట్టలు కొట్టిన పుల్‌ టాంకులంటూ పెట్రోల్‌ డీజెల్‌ వాడకాలను తగ్గిస్తున్నారు. అమెరికా, బ్రెజిల్‌లో ఎథినాల్‌ పరిశ్రమలు పెరిగాయి. యూరప్‌లో కూడా ఎధనాల్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఎధనాల్‌ వాడకం పెరిగితే వరిధాన్యాల ఉత్పత్తి కొరవడుతుందని బ్రెజిల్‌లో భూమిలేని నిరుపేదలు టాంకల కోసమై పొట్టలు కొట్టవద్దంటున్నారు, మెక్సికోలో ఆహారధాన్యాల రేటు పెరగటంతో ఆందోళనలు పెరిగాయి. ఒక టన్ను మొక్కజొన్న 413 లీటర్ల ఎధనాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాలక్రమేణా మెక్సికో అమెరికాపై ఆధారపడి చిన్నకారు రైతులఉసురుకు నోచుకుంది. బయోఫ్యూయల్‌కై మొక్కజొన్నను తరలించడంతో తిండికైజొన్న రేట్లు పెరిగాయి. పామ్‌ ఆయిల్‌, సోయా ఉత్పత్తుల కోసమై అడవులను నాశనం చేస్తున్నారు. దీనికారణాన కార్బన్‌డైయాక్సైడ్‌ విసర్జన శాతం పెరిగింది. ఇండోనేషియాలో బయోఫ్యూయల్స్‌ ఉత్పత్తుల కారణాన రైన్‌ ఫారెస్ట్స్‌ అంతరించిపోతున్నాయి.

వెట్‌లాండ్స్‌ ఇంటర్నేషనల్‌ గణాంకాల ననుసరించి దక్షిణాసియా దేశాలలో పామ్‌ ఆయిల్‌ పంట పెరిగిన కారణాన కార్బన్‌డైయాక్సైడ్‌ విసర్జనల శాతం పెరిగింది. ప్రతి టన్ను పామాయిల్‌కు 30 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ విసర్జన జరుగుతుంది. బయో ఫ్యూయల్స్‌ కారణాన భూమిలో తాపం పెరుగుతుంది. అమెరికాలో 20 శాతం జొన్న ఉత్పత్తులనుండి ఐదు బిలియన్ల గ్యాలన్ల ఎథనాల్‌ ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఒక శాతం ఆయిల్‌కు ప్రత్యామ్నాయం బయో ఫ్యూయల్‌ వినియోగం గాలన్‌ ఎధనాల్‌ ఉత్పత్తికి 1700 గాలన్ల నీరు అవసరం ఉంటుంది. మొక్కజొన్న సేద్యానికి ఎక్కువ నత్రజని, పురుగుమందులు, ఎరువులు అవసరం ఉంటాయి. స్పెర్న్‌రిపోర్ట్‌ ప్రకారం కార్బన్‌డయాక్సైడ్‌ విసర్జనలు అడవులను అంతమొందించి వ్యవసాయం కారణంగా 18 శాతం రవాణా వలన 14 శాతం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంతోలోతు నుండి నీటిని పంప్‌ చేయడం కారణంగానూ, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం కారణాన ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ విసర్జన వుంటుంది. దీనికి పరిష్కారం ఏమంటే, సేంద్రీయ వ్యవసాయం, స్థానికంగా ప్రకృతి సిద్ధంగా మనకు లభించిన వనరులను సరిగా ఉపయోగిస్తే కార్బన్‌డయాక్సైడ్‌ విసర్జన శాతం తగ్గుతుంది. ఆహార పదార్థాలలో నాణ్యత వుంటుంది. వ్యవసాయాన్ని పారిశ్రామీకరణ చేయకూడదు. ప్రకృతికి విఘాతం కల్గించకుండా సమతుల్యాన్ని పాటిస్తే,వాతావరణం కూడా అనుకూలిస్తుంది.

ఆంధ్రప్రభ దినపత్రిక కు కృతజ్ఞతలతో

http://andhraprabha.com/NewsItems.asp?ID=APV20080514041400&Title=Articles+%2F+Columns&lTitle=%AAy%F9ry%CC%C1V+%2F+%AAy%F9%C6%D8%F9%83y%CC%C1V&Topic=0

Seja o primeiro a comentar

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO